Los Angeles Fire: అమెరికా ఎప్పుడు లేని పరిస్థితితో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కేలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. కేలిఫోర్నియాలో మంటలు పెద్దగా వ్యాప్తి చెందుతున్నాయి. లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాల్లో మంటలు విస్తరిస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిద అయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు…