ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి, ఇతర ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ జరిపారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. విశాఖను పెట్టుబడులకు వేదికగా మలుచుకోవాలన్న సీఎం ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి.…