తెలుగు సినిమా కార్మికుల బంద్ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ భేటీలోని కీలక అంశాలను సీ కళ్యాణ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతిరోజూ చిరంజీవి ఫాలో అప్ చేసి సమస్య పై తెలుసుకుంటున్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారు.నేను ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో అలాగే ఛాంబర్ ప్రెసిడెంట్ తో మాట్లాడాను. ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న నిర్మాతల సమస్యలను తప్పుకుండా దృష్టిలో…