టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల స్థాయిలోనే ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టివ్ నిర్మాతలు, ఇటు ఒకప్పటి నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రధానంగా రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ Vs మన ప్యానెల్…