ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు.