ఢిల్లీ సింఘు సరిహద్దులో “సంయుక్త కిసాన్ మోర్చా” నేతల సమావేశం ముగిసింది. రైతు ఆందోళనలో భాగంగా ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది “సంయుక్త కిసాన్ మోర్చా.” రేపు లక్నోలో “కిసాన్ మహా పంచాయత్” కార్యక్రమం వుంటుంది. నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో సభలు, సమావేశాలు, అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తారు. నవంబర్ 29న “పార్లమెంట్ మార్చ్” కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యచరణ కోసం నవంబర్ 27న మరో సారి సమావేశం కావాలని నిర్ణయించింది…