Rythu Nestham : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం (జూన్ 17) ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల తయారీ, సాంకేతిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు…