ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, దాని దుర్వినియోగం సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నటి శ్రీలీల సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై, తన తోటి నటీమణులపై జరుగుతున్న ఏఐ ఆధారిత తప్పుడు ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. నటి శ్రీలీల తన పోస్ట్‌లో ఏఐ ఆధారిత అసభ్యకర కంటెంట్‌ను సృష్టించే వారిని మరియు దానికి మద్దతు ఇచ్చే…