ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది.