Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ఆయన ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు…! ఎక్కడి నుంచైనా చిటికేస్తే చాలు పనులు చకాచకా పూర్తయిపోతాయి. అయినా సరే ఆయన రోజూ టంచనుగా ఆఫీసుకు రావాల్సిందే..! ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి అంతకు రెట్టింపు విమర్శలు చేసే బాపతు కాదాయన. విమర్శకులకు కూడా తన పనితనంతోనే సమాధానం చెబుతారు. అనుభవం లేదు కదా ఈయనేం పీకుతాడులే అని కారుకూతలు కూసినవాళ్లు కూడా ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ చూసి ముక్కున వేలుసుకుంటున్నారు. ఇప్పటికే… -
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
Explainer: పాక్-అఫ్ఘాన్ సరిహద్దు వెంబడి మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొండల మధ్య ఒక్కసారిగా డ్రోన్ల గర్జన వినిపించింది. వరుస పేలుళ్లతో బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ ఖ్వా సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి నేరుగా డ్రోన్లను పంపి ఐసీస్-K స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఇంతకీ పాక్‌లోని ఐసీస్-K స్థావరాలను అఫ్ఘాన్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ఈ మంటలకు ఆజ్యం పోసింది ఎవరు? అఫ్ఘాన్… -
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
ప్రపంచంలో ప్రతి ముగ్గురిలోని ఒకరి శరీరంలో ఒక ప్రమాదకర పరాన్నజీవి దాగి ఉందని చెబితే నమ్ముతారా? అది చాలా మందికి ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు. కానీ సరైన పరిస్థితులు ఏర్పడితే అదే పరాన్నజీవి మన కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీయగలదు. గర్భంలో పెరుగుతున్న శిశువు ప్రాణానికే ప్రమాదంగా మారగలదు. ఇంతటి ముప్పు ఉన్నా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో దీనికి ఇంకా తగిన ప్రాధాన్యం దక్కలేదని శాస్త్రవేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ పారాసైట్ ఏంటి? అది ఎంత… -
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
యుద్ధాలు జరిగాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. రాజులు మరణించారు. హత్యలు జరిగాయి. అధికారం చేతులు మారింది. అయితే ఈ ఘటనలన్నింటికీ కారణం కోహినూర్ వజ్రమా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రమైన కోహినూర్.. అత్యంత వివాదాస్పదమైనది కూడా. ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న పురుష పాలకులకు దురదృష్టమే ఎదురైందట. ఇంతకీ ఈ వజ్రానికి నిజంగానే శాపం ఉందా? లేదా చరిత్రలో జరిగిన ఘటనలనే కాలక్రమంలో ఒక రహస్య కథగా మార్చేశారా? మరి శ్రీకృష్ణుడి శ్యామంతక మణికి, కోహినూర్‌కు నిజంగా ఏమైనా… -
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?
Singapore Gold Hub: భారతీయులకు బంగారం మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఏదైనా సరే కచ్చితంగా బంగారం కొంటుంటాం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనేది మనమే. అయితే ఈ బిజినెస్ లో అసలైన లాభాలు, ఆధిపత్యం మాత్రం మనకు రావడం లేదు. ఆసియాలో ఇండియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లు చేస్తుంటే.. సింగపూర్ లాంటి దేశాలు తెర వెనుక ఉండి అసలు ఆట ఆడుతున్నాయి.… -
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్‌ను నిండా ముంచేసిన ఇరాన్!
Explainer: దుబాయ్ అనగానే ఆకాశహర్మ్యాలు.. విలాసవంతమైన జీవితం… వ్యాపార సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఇటీవల ఇరాన్ చేసిన దాడులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడూ లేనంతగా ఆందోళన మొదలైంది. పర్యాటకులు, పెట్టుబడిదారులను తిరిగి రప్పించేందుకు దుబాయ్ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ నాలుగు నెలల కాలంలో కోల్పోయిన దానిని త్వరగా పూడ్చుకునేందుకు దుబాయ్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. మార్చిలో… -
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
Air India Flight 182-Kanishka Explained: 1985 జూన్ 23. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రశాంతంగా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ‘కనిష్క’ ఒక్కసారిగా గాల్లోనే ముక్కలైపోయింది. ఆకాశం నుంచి మృత్యువు కురిసిన క్షణమది! ఆ ఘటనలో చిన్నారులు, మహిళలు సహా మొత్తం 329 మంది అమాయకులు సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కాదు.. అంతర్జాతీయ చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి! ఈ ఘాతుకం వెనుక ఉన్నది ‘ఖలిస్తానీ ఉగ్రవాదులే’… -
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
మన దేశంలో చాలా మందికి పాస్‌పోర్ట్ ఉంటే… అదే అసలైన పౌరసత్వ గుర్తింపు అని ఓ బలమైన నమ్మకం ఉంది. ఎవరైనా విదేశాలకు వెళ్లాలన్నా… గుర్తింపు కార్డుగా చూపించాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది పాస్‌పోర్టే. అయితే విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది పౌరసత్వానికి నిదర్శనం కాదని తేల్చి చెప్పింది. అసలు మన దేశంలో పౌరసత్వాన్ని ఎలా గుర్తిస్తారు? రాజ్యాంగం… -
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
1943…ప్రాంతం బెంగాల్..! ఇంటి ముందు ఆడుకోవాల్సిన పిల్లలు నేలపై కదలకుండా పడుకుని ఉండేవారు. తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువులు ఎముకల గూడులుగా మారిపోయేవారు. పొలాల్లో పంటలు కనిపించినా వాటిని కొనడానికి ప్రజల చేతిలో డబ్బు ఉండేది కాదు. నగర వీధుల్లో నడిచే ప్రతి అడుగుకూ ఒక శవం కనిపించేది. ఆకలితో అలమటిస్తూ చివరి శ్వాస తీసుకున్న మనుషులు రోడ్ల పక్కనే కుప్పకూలిపోయేవారు. ఇదంతా గతమే కానీ.. నాటి బాధ, ఆ ఆకలి, ఆ మరణాల కథ మళ్లీ… -
AI: ఏఐ తీసుకొస్తున్న భారీ ముప్పు.. నెలల్లోనే అంతా స్మాష్..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మన పనులను ఎంత సులభం చేస్తుందో.. అంతే స్థాయిలో ప్రమాదాలను కూడా వెంట తీసుకొస్తోంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున సైబర్ దాడులు పెరగొచ్చని.. కొత్త ముప్పులను ఎదుర్కోవడానికి ఇంకా చాలా సమయం ఉందని ఇప్పటిదాకా మనం భావించాం. అయితే ప్రపంచ అగ్రగామి ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం తాజాగా ఒక సంచలన హెచ్చరిక జారీ చేశాయి. సైబర్ సెక్యూరిటీ ముప్పు ముంచుకొచ్చేందుకు సంవత్సరాలు కాదు.. కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉందని వార్నింగ్ ఇస్తున్నాయి.…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!