ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని హితవు పలికారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు…