ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దులు కరణం బలరాం.. ఏలూరి సాంబశివరావులు గెలిచారు. తర్వాత కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ ఇంచార్జ్ గా కరణం వెంకటేష్ కు భాద్యతలు అప్పగించారు.. నియోజకవర్గంలో ఆయనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేయటంతో వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ చీరాల నుంచి పోటీ…
కాంగ్రెస్ వ్యవహారం నచ్చక బీజేపీలో చేరిపోయారు మర్రి శశిధర్‌రెడ్డి. అదేదారిలో మరికొందరు ఉన్నట్లు టాక్. గ్రేటర్‌లో కాంగ్రెస్ బలహీన పడిందని.. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్‌కు లాయలిస్టులుగా పేరు ఉన్నవాళ్లే ఆ పార్టీకి దూరం అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ మారకుండా ఆపడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. మిగిలిన నాయకులు వెళ్లిపోకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గ్రేటర్ హైదరాబాద్ లోనే…