ఏపీలో సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్‌కు 2024 ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఖద్దరు మీద మోజు పెరిగింది. ఎన్నాళ్ళని వాళ్ళకి వీళ్ళకి సలాం కొడతాం.... అదేదో... మనమే కొట్టించుకుంటే పోలా... అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తాను చేస్తున్న అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఒక్కటంటే.. ఒక్కరోజులోనే రాజీనామా చేసేసి... కేవలం ఒక్క పూటలోనే ఓకే స్టాంప్ వేయించుకున్నారు.