పెళ్లైన హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టటం దాదాపుగా తప్పనిసరే! అదే పని చేస్తోంది హేమా మాలిని కూతురు ఈషా డియోల్. భరత్ తఖ్తానీని పెళ్లాడిన మిసెస్ ఈషా ఇద్దరు అమ్మాయిలకు తల్లి కూడా. అయితే, కూతుళ్లు ఇద్దరు కాస్త పెద్దవారవటంతో మరోసారి కెమెరా ముందుకు వచ్చేసింది ఈషా. అయితే, నటిగానే కాదు నిర్మాతగా కూడా బరిలో దిగుతోంది టాలెంటెడ్ బ్యూటీ… ఈషా డియోల్ తఖ్తానీ భర్త భరత్ తో కలసి ‘భరత్ ఈషా ఫిల్మ్స్’ ప్రారంభించింది.…