రేవంత్, కేటీఆర్ మీరు ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు... మోకాళ్ల యాత్ర చేయండన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు.