ప్రముఖ డైరెక్టర్ శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తాజాగా తెలిపింది. రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రోబో’. శంకర్ టేకింగ్, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సంబంధించిన భూకబ్జా కేసులో ఈడీ దూకుడు పెంచింది. శుక్రవారం రాంచీలోని భూ వ్యాపారి కమలేష్ కుమార్ ఆవరణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.