గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం సీఎంవో వరకు వెళ్లడంతో వారిద్దరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరి పంచాయతీ వివాదంపై పరిష్కరించేందుకు తొలుత బుధవారం సాయంత్రం రావాలని ఆదేశించినా… అనంతరం గురువారం సాయంత్రం 6గంటలకు తాడేపల్లికి రావాలని సీఎంవో సూచించింది. Crime News: గుంటూరు జిల్లాలో గుజరాత్…