విద్యుత్ పంపిణీ సంస్థలు అధికారులతో ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, డిస్కం సిఎండిలు జె.పద్మాజనార్థన్ రెడ్డి, కె.సంతోషరావు, హెచ్ హరనాథ్ రావు పాల్గొన్నారు.డిస్కం సిఎండిలు డివిజన్ స్థాయిలో పర్యటించాలన్నారు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రౌండ్ లెవల్ లో విద్యుత్ వినియోగం, సరఫరాపై సమీక్షించుకోవాలన్నారు. డిస్కంల పనితీరును మరింత మెరుగు పరచాలి. రైతులకు విద్యుత్ ను ఇచ్చే ట్రాన్స్ ఫార్మర్‌లు కాలిపోతే తక్షణం స్పందించాలి.…