మందుబాబులం మేం మందుబాబులం అంటే చాలు గబ్బర్ సింగ్ మూవీ గుర్తుకు రావాల్సిందే అందులో కోటా శ్రీనివాస్ రావు పోలీస్టేషన్ లో చేసే హడావుడి ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాగుబోతులంటే ఎందుకంత చులకన అంటూ వేసే స్టేప్పులతో ఆసాంగ్ కు సినిమా హాల్ లో విజల్స్ తో దద్దరిల్లింది.
ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే…