Pakistan: పాకిస్తాన్ దేశంలో హిందూ మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. అక్కడ మైనారిటీ హక్కులను కాలరాస్తున్న అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్ లో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు ధరమ్ దేవ్ రాతిని అతడి డ్రైవర్ హనీఫ్ లెఘారీ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో డాక్టర్ ధరమ్ దేవ్ రాతిని మంగళవారం డ్రైవర్ గొంతు కోసి హత్య చేశారు.…