Ayyappa Mala Row: విజయవాడ నగరంలోని భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్‌లో ఉన్న బెజవాడ రాజారావు స్కూల్‌లో వివాదం నెలకొంది. 5వ తరగతి, 3వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల ధరించి పాఠశాలకు వచ్చారు, స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపింది.