‘లవ్ టుడే’తో భారీ సక్సెస్ సాధించిన ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా తన మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్, ఆ తరువాత ‘డ్రాగన్’ చిత్రంతో హీరోగా మారి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ప్రదీప్‌కు వరుస సినిమాలు లైన్‌లో ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ సినిమాల పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.…