సాక్షి దినపత్రికలో వంద వారాల పాటు ఏకధాటిగా సాగిన పాపులర్ ఇంటర్వ్యూల శీర్షిక ‘డబుల్ ధమాకా’ పుస్తకరూపంలో వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వై.ఎస్. భారతి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ‘డబుల్ ధమాకా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సినిమా, సాహిత్యం, రాజకీయం, నృత్యం, సంగీతం, క్రీడలు, టీవీ, సమాజం.. ఇలా వివిధ రంగాలలోని ఇద్దరేసి ప్రముఖులను కూర్చోబెట్టి జర్నలిస్టు ఇందిర పరిమి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూల సమాహారమే ఈ…