హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మిక వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. అమాంతంగా వరదలు సంభవించడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా.. ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు 87 మంది చనిపోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు.