Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ పిలుపు మేరకు, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దారుణం, సాగర్ దత్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులను కొట్టిన సంఘటనకు నిరసనగా ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు జరిగింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల నుంచి చేపట్టిన జ్యోతి ప్రజ్వలనలో జూనియర్ డాక్టర్లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆర్జీ ట్యాక్స్ కుంభకోణంపై సోమవారం సుప్రీంకోర్టు…
PHC Doctors: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) డాక్టర్లు వైద్య సేవలను ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Hyderabad: హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో జూడాల ధర్నా చేపట్టారు. స్మానియా మెడికల్ కాలేజ్ చేపట్టిన నిరసనలో గాంధీ, ఉస్మానియా జూడాలు పాల్గొన్నారు.
Doctors strike: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఆగస్టు 17న దేశవ్యాప్తంగా అన్ని చిన్నా, పెద్దా ఆసుపత్రులను మూసివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 24 గంటల పాటు వైద్యులు సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే సమ్మె మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
Kolkata incident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన వార్త విన్న వారెవరికైనా కాళ్ల కింద నుంచి నేల కదులుతుంది.