దాదాపు 150 ఏళ్ల నాటి రాజద్రోహ సెక్షన్ 124ఏ చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా మోదీ సర్కారు ఎన్ని ట్రిక్కులు వేసినా, చట్టాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష పూర్తయ్యి, కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఈ చట్టంకింద ఎటాంటి కేసులు, చర్యలు తీసుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రస్తుతం…