తెలంగాణ రాష్ట్రంలో దుర్గమూల్యాలకు సమర్థంగా స్పందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (టీజీడీఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫోర్స్‌లో సుమారు 2000 మంది సభ్యులుంటారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రతిపాదనలపై చర్చించారు. సమాచారంలో ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదలు , లోతట్టు…