తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీలో ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని.. చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సీనియర్ ఆర్టిస్ట్, నిర్మాత అశోక్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీని రోడ్డు మీదకు తేవడం దుర్మార్గం. ఏదైనా నిర్ణయం కావాలంటే అది ఛాంబర్ ద్వారా జరగాలి. ఛాంబర్ మనకు ప్రభుత్వ బాడీలా వ్యవహరిస్తుంది. అందుకే రెండు సంవత్సరాలకు…