Director VN Aditya Fires on People Media Factory: టాలీవుడ్ డైరెక్టర్ ‘వీఎన్ ఆదిత్య’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమా ‘మనసంతా నువ్వే’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనంతరం శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, రెయిన్ బో లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో నేనున్నాను భారీ హిట్ అవ్వగా.. బాస్, ఆట పర్వాలేదనిపించాయి. 2011 తర్వాత వీఎన్ ఆదిత్య హిట్ కొట్టనే లేదు. 2018లో ఓ…
సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు శిష్యుడు వి. ఎన్. ఆదిత్య. అందుకే ఈయనలోనూ ఆయన పోకడలు కనిపిస్తాయి. గురువుగారి బాటలోనే సాగుతున్న ఆదిత్య రాశికి కాకుండా వాసికి ప్రాధాన్యమివ్వాలని తపిస్తుంటారు. ఏప్రిల్ 30 వి.ఎన్. ఆదిత్య పుట్టిన రోజు. విశేషం ఏమంటే ఈ యేడాది అక్టోబర్ 19తో దర్శకుడిగా వి.ఎన్. ఆదిత్య రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసంతా నువ్వే’ 2001 అక్టోబర్ 19న విడుదలై అఖండ విజయాన్ని…