Neha Shetty: ప్రస్తుతం గత కొన్ని రోజులుగా నేహాశెట్టి పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం వరుస అవకాశాలను అందించింది. అయితే నేహశెట్టి కెరీర్ ను మార్చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది డీజే టిల్లు అని చెప్పాలి.