(ఏప్రిల్ 17న ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు) చెప్పాలనుకున్న కథను సూటిగా చెప్పాలని ప్రయత్నిస్తారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలోనూ పొరపాట్లు కనిపించవచ్చు కానీ, తడబాటుకు తావు ఉండదు. నిదానం ప్రధానం అనుకుంటూ తన దరికి చేరిన చిత్రాలకు న్యాయం చేయాలని తపిస్తూ ఉంటారు మోహనకృష్ణ. ఇంద్రగంటి మోహనకృష్ణ 1972 ఏప్రిల్ 17న తణుకులో జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, తల్లి జానకీబాల ఇద్దరూ ప్రముఖ రచయితలు. శ్రీకాంతశర్మ ‘ఆంధ్రప్రభ’ సచిత్రవారప్రతికకు ఎడిటర్ గానూ పనిచేశారు.…