అసలు పేరు బెజవాడ గోపాల్, అయినా ఆయనను ‘భారీ చిత్రాల గోపాల్’ అనే పిలుస్తుంటారు. దర్శకుడు బి.గోపాల్ సినిమాలు భారీతనంతో రూపొంది ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ అద్దిన ఘనత బి.గోపాల్ సొంతం. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షనిస్ట్ ను హీరోగా నిలపడంతో, ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. స్వర్ణోత్సవాలు చూసింది. దాంతో ఎందరో తెలుగు నిర్మాతలు తమ చిత్రాలలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ ఆపాదిస్తూ చిత్రాలను తెరకెక్కించారు. గోపాల్ దర్శకత్వంలోనే…