Today (12-01-23) Business Headlines: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భేష్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యానికి అనుగుణంగా కొనసాగుతున్నాయి. 10 నెలల్లో 14 పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది 86 పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి సమానం. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లకి సంబంధించి పోయినేడాదితో పోల్చితే ఇది దాదాపు పాతిక శాతం ఎక్కువ.