భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిశాడు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.