లాస్ట్ వీకెండ్ మొత్తం ఏడు చిత్రాలు విడుదల కాగా, ఇప్పుడు వాటికి మరో రెండు జతై తొమ్మిది చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అమిగోస్'. ఇది హిట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ కొట్టినట్టే!
దర్శకరత్న దాసరి నారాయణ కోసం రిజిస్టర్ చేసిన 'దేశం కోసం' అనే టైటిల్ ను రవీంద్ర గోపాల కోరడంతో ఇచ్చేశానని నిర్మాతల మండలి అధ్యక్షుడి సి. కళ్యాణ్ తెలిపారు. భగత్ సింగ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 10వ తేదీ విడుదల కాబోతోంది.