ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు