Delhi school blast: ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ఏరియాలోని సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు శబ్ధం 2 కి.మీ వరకు వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల పక్కనే ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు…