Delhi: బంగ్లాదేశ్ హిందువులపై అకృత్యాలు జరుగుతున్న నేపథ్యంలో హజ్రల్ నిజాముద్దీన్ దర్గా ప్రాంతంలోని మతపెద్దలు, నివాసితుల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించి స్వదేశానికి పంపించేందుకు స్పెషల్ డ్రైవ్‌ని చేపట్టాలని కోరినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచి రాష్ట్రాన్ని నడిపించకుండా కేజ్రీవాల్ ను ఏ చట్టం ఆపదు అని పేర్కొన్నారు.