తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా ఒకే సారి ఒక సినిమాకు పని చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి సాహసం చేస్తారు. అనంతపురం నుంచి వచ్చిన అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయి సుమయా రెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకునేందుకు రెడీగా అవుతోంది. తానే నిర్మాతగా, హీరోయిన్‌గా, కథా రచయితగా ‘డియర్ ఉమ’ చిత్రంతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించగా…