Cyclone Michuang Enters Bapatla: బంగాళఖాతంలో ఏర్పడిన ‘మిచౌంగ్’ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో గంటలో మిచౌంగ్ తుపాను పూర్తిగా తీరాన్ని దాటనుందని పేర్కొన్నారు. తుపాను బాపట్ల తీరం దాటిన తర్వాత.. సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేశారు.