దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సమే సృష్టించనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో దానా తుఫాన్ హడలెత్తించనుంది. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రేపు దానా తుఫాన్ తీరం దాటనుంది. ఏపీ సహా మూడు రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతోంది. దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.