Drugs Party: గచ్చిబౌలి ప్రాంతంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. స్టార్ హోటల్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో నగరంలో సంచలనం నెలకొంది. తెలంగాణ ఈగిల్ (EAGLE) ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సేవించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్ బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ (Kove Stays) హోటల్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి…