(జూలై 11న సీఎస్సార్ ఆంజనేయులు జయంతి) చిలకలపూడి సీతారామాంజనేయులు – ఇలా పూర్తి పేరు చెబితే ఎవరికీ ఆయన అంతగా గుర్తుకు రారు. సింపుల్ గా ‘సీయస్సార్’ అనగానే విన్నవారి పెదాలపై నవ్వులు నాట్యం చేయకమానవు. పీలగా ఉన్నా పేలిపోయే మాటలతో ఆకట్టుకోగలరు. ఎదుటివారి గాలితీస్తూ గేలిచేసేలా నటించి వినోదం పంచగలరు. అరుదైన వాచకంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన దిట్ట సీయస్సార్. ఆయన పరకాయప్రవేశం చేసిన అనేక పాత్రలు బుల్లితెరపై ఈ తరం వారినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన…