వరుసకు బాబాయ్.. తండ్రి తర్వాత తండ్రిలా కాపాడాల్సిన వాడు. కానీ పసిపిల్లాడిని కిరాతకంగా చంపేశాడు. మైలార్ దేవ్ పల్లి లో నాలుగు సంవత్సరాల బాలుడు లక్ష్మీ నరసింహను హత మార్చిన కసాయి బాబాయి వీరేశంను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. హంతకుడు బాలుడి తల్లి మహేశ్వరి చెల్లి భర్త. స్వయానా మరిది కావడం గమనించాల్సిన విషయం. గత కొన్ని రోజులుగా బాలుడు తల్లి మహేశ్వరి చెల్లిని వేధిస్తున్నాడు మరిది వీరేశం. భర్త వేధింపులు భరించలేక తనకు విడాకులు కావాలంటూ…