దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాక పతాకావిష్కరణలతో మువ్వన్నెల జెండా ఆకాశంలో రెపరెపలాడింది. సోమవారం కర్తవ్య పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లోని పూర్తి పురుషుల బృందానికి నాయకత్వం వహించి CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి…