NCRB Report: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసింది. 2023లో దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు ఢిల్లీలో నమోదయ్యాయని NCRB నివేదిక పేర్కొంది. అయితే.. 2022తో పోలిస్తే 2023లో ఢిల్లీలో మహిళలపై నేరాలు 5.59 శాతం తగ్గాయని కూడా నివేదిక పేర్కొంది. NCRB నివేదిక ప్రకారం.. 2023లో రాజధాని ఢిల్లీలో మహిళలపై 13,000 కి పైగా నేరాలు నమోదయ్యాయి. 2022లో 14,158 కేసులు, 2021లో…