Virat Kohli MS Dhoni in Ranchi: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేకు సిద్ధమవుతున్న సమయంలో గురువారం సాయంత్రం కోహ్లీ రాంచీలోని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నివాసానికి చేరుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కోహ్లీ కారు ధోనీ ఇంటి గేటు దాటుతుండగా బయట భారీగా చేరుకున్న అభిమానులు ఒక్కసారిగా హోరెత్తిపోయారు. మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు తహతహలాడారు.