బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఇంత కాలం ఎవరున్నా టీమిండియా సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే వినిపించేవి తప్ప, బీసీసీఐ తెరవెనుక ఉండేది. కానీ, గంగూలి ఎప్పడైతే సీన్ లోకి వచ్చాడో అప్పటి నుండి సీన్ మారింది. ఆటగాళ్ల మధ్య ఉన్న స్పర్థల్ని మరింత పెరిగేలా బీసీసీఐ ధోరణి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభేదాలు పరిష్కరించాల్సిన బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్ గా కొహ్లీని తప్పుకోమని ఆదేశించే హక్కు బీసీసీఐకి ఉంది.…