రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ..