గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం అనేది మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ మాత్రలు వేసుకుంటే గర్భం రాకుండా ఉండటమే కాదు, హార్మోన్లలో మార్పులను కూడా ప్రేరేపిస్తుందట. ఈ మాత్రను శరీరం లోపలికి వెళ్లి గర్భం రాని విధంగా హార్మోన్లలో మార్పులు తీసుకొచ్చే విధంగా తయారు చేస్తారు. శరీరం లోపల జరిగే ఈ మార్పులను నిర్వహించడం కొంతమంది స్త్రీలకు చాలా కష్టంగా ఉంటుంది. వారు మానసికంగా చితికిపోతారు.
నెలసరి వల్ల వచ్చే నొప్పి భరించలేక ఓ బాలిక గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. ఆ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె చివరకు బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూసింది. అత్యంత విషాదకర ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. యూకేకు చెందిన లైలా ఖాన్ (16) కొద్ది నెలల క్రితం విపరీతమైన పీరియడ్స్ నొప్పితో బాధపడింది. తన బాధను స్నేహితులతో పంచుకోగా గర్భనిరోధక మాత్రలు తీసుకోమ్మని సూచించారు. స్నేహితుల సలహా మేరకు ఆమె నవంబర్…